అణు సామర్థ్యం కలిగిన పృథ్వి-II క్షిపణి ప్రయోగం విజయవంతం

భారత్ పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు ఆయుధాలను మోసుకుపోగల సామర్ధ్యం గల పృథ్వి-II క్షిపణిని రక్షణశాఖ 26 నవంబర్ 2015న ఒడిషా తీరంలోని చాందీపూర్ విజయవంతంగా పరీక్షించింది.
భూతలం నుంచి భూతల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్)లోని మూడవ లాంచ్ కాంప్లెక్స్‌ నుంచి మొబైల్ లాంచర్ పైనుంచి ఉదయం 12 గంటల 10 నిమిషాలకు సైన్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఈ పరీక్షను నిర్వహించింది.
350 కిలో మీటర్ల దూరంలో లక్ష్యాన్ని చేధించగల సామర్ధ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణి 1000 కిలోల బరువు ఉన్న అణు ఆయుధాలను మోసుకోనిపోగల సామర్ధ్యం కలిగి ఉంది.
2003లో సైన్యం అమ్ముల పొదిలో చేరిన పృథ్వి క్షిపణ మన దేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన తొలి క్షిపణి.
2014లో కూడా ఈ క్షిపణిని ఒడిషా తీరంలోని చాందీపూర్ పరీక్షించారు.

Followers